అనారోగ్య సమస్యలతో సీనియర్ నటుడు కైకాల కన్నుమూత!

తెలుగ చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కైకాల సత్యనారాయణ నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వయసు పై పడటంతో గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి కైకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

కైకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన శరీరం చికిత్సకు కూడా సహకరించకపోవడంతో ఈయన పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో నేడు ఉదయం మరణించారు. ఈ విధంగా కైకాల సత్యనారాయణ మరణ వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ ఈయన మరణ వార్తకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

సిపాయి కూతురు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైనటువంటి కైకాల సత్యనారాయణ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ ఎన్నో సేవలు అందించిన కైకాల మరణ వార్త నిజంగానే ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.