Sankranti Movies: సంక్రాంతి సినిమాలకి అసలు పరీక్ష మొదలైంది

టాలీవుడ్‌కి సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, బాక్సాఫీస్‌కి ఒక బూస్ట్ లాంటిది. ఈ ఏడాది సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చాయి. రామ్‌ చరణ్‌ “గేమ్‌ ఛేంజర్‌” బాలకృష్ణ “డాకు మహారాజ్‌” వెంకటేశ్‌ “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే సంక్రాంతి హాలిడేస్ ముగిశాయి. ఇక కేవలం ఈ వీకెండ్ మాత్రమే సినిమాలకి మంచి ఛాన్స్. సోమవారం నుంచి కలెక్షన్స్ హెవీగా డ్రాప్ కావచ్చు. అయితే వీటిలో ఏ సినిమా గెలిచి నిలబడుతుందనేది ఆసక్తిగా మారింది.

మొదట గేమ్‌ ఛేంజర్‌ గురించి చెప్పుకుంటే, ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్స్‌ బాగానే రాబట్టినా, కంటెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్‌డే వసూళ్లు స్థాయికి తగ్గట్లుగానే ఉన్నా, తదుపరి రోజుల్లో కలెక్షన్లు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఫుల్‌ రన్‌లో ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ చేరుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న.

మరోవైపు, బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌ మంచి ఆరంభాన్ని సాధించింది. మొదటి రోజుల్లో ఈ సినిమా వేగంగా వసూళ్లు రాబట్టినా, మిశ్రమ టాక్‌ ప్రభావం వసూళ్లపై పడింది. ప్రధానంగా వీకెండ్‌ తరువాత సినిమా తడబాటు కనిపిస్తోంది. అయితే యూఎస్ మార్కెట్‌లో మాత్రం బ్రేక్‌ ఈవెన్‌ చేరుకునే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక వెంకటేశ్‌ హీరోగా నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షించి మంచి ఫలితాలను సాధిస్తోంది. ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ దాటింది. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను బాగా రంజింపజేసింది. అయితే, వీకెండ్‌ తరువాత ఈ సినిమా స్టామినా ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ముందుగా బెస్ట్ సంక్రాంతి విన్నర్ గా ఈ సినిమా నిలిచింది.

పుష్ప 2 రీలోడెడ్‌ వెర్షన్‌ సంక్రాంతి సీజన్‌లో మళ్లీ థియేటర్లలోకి వచ్చినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. ఈ సీజన్‌లో పుష్ప 2కు కన్నా కొత్త సినిమాలు ఎక్కువ ఆకర్షణ సాధించాయి. శనివారం, ఆదివారం తర్వాత సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల ఫైనల్‌ రిజల్ట్‌ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఇది సినిమాలకు అసలైన పరీక్ష అని చెప్పవచ్చు. మరి వీటిలో ఏది ఎక్కువ స్తాయిలో కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

Daaku Maharaaj Movie team Interview With Suma || Balakrishna || Pragya Jaiswal || Shraddha || TR