TG Film Chamber: రెండుకోట్లు రాని హీరోకి పదమూడు కోట్ల రెమ్యునరేషన్ ఎలా?

తెలుగు సినిమా పరిశ్రమలో ఏదో తేడాగా కొనసాగుతోందన్న భావనకు తాజాగా మరింత బలం చేకూరింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుధాకర్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమ మొత్తానికీ కళ్లతెరిపించేలా ఉన్నాయి. “రెండేళ్లకో సినిమా తీస్తే, థియేటర్లు ఎలా నెట్టుకుంటాయి?” అనే ప్రశ్నలతో ప్రారంభమైన ఆయన వాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంతవరకు 2025లో వచ్చిన సినిమాల్లో కేవలం సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ మాత్రమే లాభాల్లో ఉన్నాయని, మిగతావన్నీ డిజాస్టర్లు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయాన్ని కొందరు ట్రేడ్ అనలిస్టులు వివాదాస్పదంగా మలుస్తున్నారు. డాకు మహారాజ్, తండేల్, హిట్ 3, సింగిల్ సినిమాలు వర్కౌట్ అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినా, మొత్తానికి లాభాల పట్ల స్పష్టత అవసరమని విశ్లేషకులు అంటున్నారు.

కేవలం వసూళ్లే కాకుండా హీరోలు తీసుకునే పారితోషికాల విషయంలో సుధాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కలిగించాయి. వసూళ్లు రెండుకోట్లు రాని హీరోకి పదమూడు కోట్ల రెమ్యునరేషన్ ఎలా అంటూ పరోక్షంగా ఫైర్ కావడం, ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న కష్టాల్ని హైలైట్ చేసింది. సినిమా తీసేందుకు డబ్బు రావడం కష్టంగా మారిన పరిస్థితుల్లో, తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్‌తో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలే గెలుస్తాయని స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో హీరోలు తమ పని వేగాన్ని పెంచాలని, డైరెక్టర్లు కొత్త కథల వైపు దృష్టి సారించాలని పరిశ్రమలోని పలువురు భావిస్తున్నారు. స్నాక్స్ ధరలు, టికెట్ రేట్లు, ప్యాన్ ఇండియా కలలు ఎలా ఉన్నా, ప్రేక్షకుడు చూసేది క్వాలిటీ కంటెంట్ అని, అదే లేకపోతే థియేటర్లు ఖాళీగానే ఉంటాయని ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో మిగిలిన నెలల్లో ఇండస్ట్రీ తిరగబడ్డా, కంటెంట్‌పై ఫోకస్ లేకుంటే నిలదొక్కుకోవడం కష్టం అనే సంకేతాలివే.

టీడీపీకి రాజీనామా || Big Shock to Chandrababi | Sugavasi Subramanyam Resign to TDP Party || TR