బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతోన్నా.. ఆసక్తిని పెంచేస్తోన్న సమంత!!

Samantha Big Announcement on 5th September Creates Confusion In Social Media

అక్కినేని కోడలు సమంత అంటే మామూలు విషయం కాదు. దొరికిన సమయాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలో ఆమెకు తెలిసినంతగా మరేవ్వరికీ తెలియదు. ఈ లాక్డౌన్‌లో వ్యవసాయం ఎలా చేయాలి, ఆరోగ్యకరమైన వంటలు ఎలా వండాలి ఇలా ఎన్నెన్నో విషయాలను నేర్చుకుంది సమంత. ఇంటి డాబాపైనే వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇదంతా బాగానే ఉంది కానీ సమంత తాజాగా ఓ ప్రకటన చేసింది. అది చూసిన వారందరికీ ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ సమంత చెప్పిన విషయం ఏంటంటే.

Samantha Big Announcement on 5th September Creates Confusion In Social Media
Samantha Big Announcement on 5th September Creates Confusion In Social Media

‘ఇలాంటిది ఒకటి చేయాలని ఎన్నో యేళ్ల నుంచి కలలు కంటున్నాను.. ఓ అద్భుతమైన టీం దొరకడం జీవితంలో అది నెరవేరబోతోంది. ఇది మీకు చెప్పాలని, నాతో పాటు ఉన్నవారికి, నాకు సపోర్ట్ చేస్తున్న వారికి, ఎన్నో యేళ్ల నుంచి ప్రేమను కురిపిస్తున్న వారికి ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అందుకే ఆ సంతోషాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాను.

Samantha Big Announcement on 5th September Creates Confusion In Social Media
Samantha Big Announcement on 5th September Creates Confusion In Social Media

అదెంతో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంతో అద్భుతమైన టీంతో కలిసి పనిచేశాము. గత కొన్ని నెలలుగా అందరం కలిసి పని చేసి దీన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ విషయం ఏంటో మీకు చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను అదే సమయంలో నర్వస్‌గా కూడా ఫీల్ అవుతున్నాను. రేపు (సెప్టెంబర్ 5) మధ్యాహ్నం 12 గంటలకు అదేంటో చెబుతాను’అంటూ సమంత పోస్ట్ చేసింది. ఇక అదేంటో అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించేశారు.