సమంతకు తన పెట్ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. దానికంటూ సపరేట్ బెడ్, లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఇక సమంత తన కుక్క పిల్లను ఎంత గారాభం చేస్తుందో అందరికీ తెలిసిందే. లాక్ డౌన్‌లో సమంత చేసిన సేంద్రియ వ్యవసాయ పనుల్లో తన పెట్ ఎలా సాయం చేసిందో అందరికీ వివరించింది. తన వెంటే ఉంటే మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది వాటికి సంబంధించిన వీడియోలను కూడా సమంత షేర్ చేసింది.
ఇక తాజాగా తన పెట్‌కు స్కిన్ ఎలర్జీ వచ్చింది. చేసే ప్రయత్నాలన్ని చేసిందట. అన్ని రకాల మెడిసిన్స్, జాగ్రత్తల తీసుకుందట. కానీ ఏ మాత్రం కూడా మార్పు రాలేదట. ఇక తన పెట్ బాధను చూపెడుతూ.. ఆ ఎలర్జీ ఎలా ఉందో వీడియోలో చూపెట్టింది. దానికి నివారణ పద్దతులు తెలిసిన వాళ్లు దయచేసి సాయం చేయండని కోరంది.
ఇక సమంత లాంటి వాళ్లు సాయం అడిగిగే చేయకుండా ఉంటారా? తలా ఒకరు తమకు తోచిన, తెలిసిన పద్దతులను, మందులను సజెస్ట్ చేశారు. అలా తనకు సాయం చేసిన ప్రతీ ఒక్కరికి సమంత పేరు పేరునా ధన్యవాదాలు తెలిపింది. కొందరేమో ఆలీవ్ ఆయిల్ వాడాలని, ఇంకొందరేమో హోమియోపతి బెటర్ అని, యాపిల్ సీడ్ వెనిగర్ అంటూ ఇలా సలహాలు, సూచనలు ఇచ్చారు. మరి సమంత వీటన్నంటిని పరిగణలోకి తీసుకుంటుందేమో చూడాలి.