సమంతను చూస్తే నిజంగానే ఏ మాయ చేశావే అనాల్సిందే. నానాటికి సమంత అందం పెరుగుతూనే ఉంది. సినిమా సినిమాకీ సమంత మరింత అందంగా తయారవుతోంది. రంగస్థలంలో డీ గ్లామర్ రోల్ చేసినప్పటికి సమంతలోని క్యూట్ నెస్ మాత్రం తగ్గలేదు. అందులో సమంత లుక్స్, నటనకు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. ఇక సమంత ఆ మధ్య వర్కౌట్లు చేసి మరింత నాజూగ్గా అందంగా తయారైంది.
ఈ మధ్య సమంత ఎప్పుడూ కూడా తనలోని అందాన్ని, గ్లామర్‌ను, హాట్ నెస్‌ను ఎక్స్పోజ్ చేయలేదు. కానీ తాజాగా ఉపాసనతో కలిసి URLife అనే వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అదరగొట్టింది. సమంత తన అందాన్ని, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటోంది? ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటోంది? ఎలాంటి వ్యాయమాలు చేస్తోంది? అంటూ ఇలాంటి విషయాలన్నీ సదరు వెబ్‌లో పొందుపర్చనున్నారు.
ఈ వెబ్ సైట్ కోసం సమంత ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసింది. ఇక ఆ ఫోటోలు, అందులోని సమంత అందాలు చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. తాజాగా మరికొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో సమంత కసరత్తులు చేస్తోన్న స్టిల్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి సమంత పెట్టిన ఈ అందాల చిచ్చు మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. సమంత ప్రస్తుతం సాకీ వరల్డ్ డిజైనర్ దుస్తులను మార్కెట్లోకి తెచ్చే పనిలో బిజీగా ఉంది. మరో వైపు బాల్కనీలో ఉన్న వ్యవసాయ క్షేత్ర పనులను కూడా చూసుకుంటోంది.
Don’t aim for perfection ! Aim for consistency! @urlife_co_in x @Samanthaprabhu2
Full video : https://t.co/nNdY8kgh3K pic.twitter.com/7slkaOa3P1
— Upasana Konidela (@upasanakonidela) September 23, 2020