అమ్మాయిలకే ఎందుకు ఈ బాధలు.. కదిలించేలా సమంత సూటి ప్రశ్నలు!!

Samantha Akkineni ABout Feminism And Ladies Problems

సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమాజంలోని అసమానతలు, సమాజంలో జరిగే అన్యాయాలపైన గొంతెత్తుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని అంతే స్పోర్టీవ్‌గా తీసుకుంటుంది. అదే రీతిలో ట్రోలర్స్‌కు కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఇక చిన్మయి చేసే పనులకు సమంత ఎంతలా మద్దతిస్తుందో అందరికీ తెలిసిందే.

Samantha Akkineni ABout Feminism And Ladies Problems
Samantha Akkineni ABout Feminism And Ladies Problems

తాజాగా సమంత మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రశ్నలను సంధించింది. నేను అతనికి సరిపోతానా? అది నా తప్పేనేమో? నేను వారిని చూడటం మానేయాలి.. అప్పుడే అతనంటే నాకు ఇంట్రెస్టెంట్ లేదని అర్థమవుతుంది? నేను బరువు తగ్గాలేమో? నేను మాట్లాడితే.. బయటకు చెబితే.. వారు నమ్ముతారేమో? నేను ఈ జాబ్‌కు సరిపోతానా? నా గురించి జనాలు ఏమనుకుంటారో?

Samantha Akkineni ABout Feminism And Ladies Problems
Samantha Akkineni ABout Feminism And Ladies Problems

అర్దరాత్రి నేను ఇంటికి నడవలేను? నా బట్టలు మరీ కనిపించేలా ఉన్నాయా? ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంది చూడు? నువ్ అందరి లాంటి దానివి కాదు.. అది కావాలని అడుగుతుంది.. నువ్ నవ్వుతూ ఉంటే అందంగా ఉన్నావ్? పెళ్లి ఎప్పుడు? నీ కుటుంబాన్ని ఎప్పుడు ఏర్పరుచుకుంటావ్? ఆడదానిలా ప్రవర్తించు.. ఇలా సవాలక్ష ప్రశ్నలు ఆడవాళ్లకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మహిళకైనా సరే అంటూ సమంత ఓ కార్టూన్‌ను షేర్ చేసింది. ఇక సమంత షేర్ చేసిన ఈ పిక్ ఎంతోమందిలో ఆలోచనలు రేకెత్తిస్తోంది.