డైనోసర్ “సలార్” యూఎస్ రిలీజ్ పై మరో భారీ అప్డేట్.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా డైనోసర్ ప్రభాస్ హీరోగా నటించిన సెన్సేషనల్ చిత్రం “సలార్ ది సీజ్ ఫైర్” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్(కేజీఎఫ్ ఫేమ్) తెరకెక్కించిన ఈ చిత్రం వాటికి పదింతలు మాస్ ఏక్షన్ తో తెరకెక్కించగా.

ఇపుడు అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కి సంబంధించి ఊహించని అప్డేట్ లు ఇప్పుడు వస్తున్నాయి. అయితే యూఎస్ లో ఈ చిత్రం రికార్డు రిలీజ్ చేస్తున్నట్టుగా అక్కడ డిస్ట్రిబ్యూటర్ సంస్థలు కన్ఫామ్ చేయగా ఇది వరకే అక్కడ ఉన్న ప్రముఖ థియేటర్స్ మార్కెట్ సినీ మార్క్ అన్నిటిలో కూడా సలార్ చిత్రాన్ని వేస్తున్నట్టుగా కఫార్మ్ చేశారు.

అయితే ఇదొక భారీ రికార్డు కాగా ఇక లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ అప్డేట్ ని అందించారు. ఇక ఈ అప్డేట్ తో యూఎస్ లో మరో మేజర్ థియేటర్లు సంస్థ మార్కస్ థియేటర్స్ అన్నిటిలో కూడా సలార్ చిత్రమే ప్రదర్శితం కానుంది అని కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఇది కూడా మరో నెవర్ బిఫోర్ రిలీజ్ గా నిలిచింది అని చెపున్నారు. మొత్తానికి అయితే యూఎస్ మార్కెట్ మొత్తాన్ని కమాండర్ సలార్ తన ఆధీనంలోకి తీసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ మాసివ్ చిత్రం రిలీజ్ కి ఇంకా కొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా ఆడియెన్స్ ఈ సెప్టెంబర్ 28 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.