వైరల్ : పెళ్లి ఫోటోపై ఫైర్ అయ్యిన సాయి పల్లవి..!

సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ ఉన్న స్టార్ అండ్ యంగ్ హీరోయిన్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా ఒకామె. అయితే సాయి పల్లవి ఇప్పుడు పలు సౌత్ సహా హిందీ సినిమాలు కూడా చేస్తూ వెళ్తుంది. కాగా సాయి పల్లవి చాలా సెలెక్టీవ్ గా అయితే ఒకో సినిమా ఎంచుకుంటూ బిజీగా మారుతుంది.

మరి అలా రీసెంట్ గానే తెలుగులో ఓ సినిమా ఓకే చేసిన తాను ఇప్పుడు అయితే మళ్ళీ తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధం అయ్యింది. అయితే ఉంటే గత కొన్ని రోజులు నుంచి సాయి పల్లవి ఓ పిక్ వైరల్ గా మారింది. సాయి పల్లవికి పెళ్లి అయిపోయింది అని అది కూడా ప్రేమ పెళ్లి అంటూ స్టార్ట్ అయ్యింది.

మరి ఇది వైరల్ అవుతూ ఆఖరికి సాయి పల్లవి స్పందించే వరకు వెళ్ళింది. తాను ఎప్పుడు కూడా ఎలాంటి రూమర్స్ కోసం కూడా స్పందించను అంత అవసరం కూడా నాకు లేదని కానీ పట్టించుకోని విషయాల్లో నా కుటుంబం స్నేహితులు సఫర్ అయ్యే వరకు వచ్చింది అంటే డెఫినెట్ గా మాట్లాడుతాను అని అగ్రెసివ్ గా చెప్పింది.

ఒక సినిమా పూజా కార్యక్రమంలోని పిక్ ని కట్ చేసి చాలా మంది పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు అని నేను నా సినిమాలు కోసం అందరికి పంచుకోవడం ఇష్టమని కానీ దానిని కొందరు పని లేని వాళ్ళు ఇలా వక్రీకరించి వార్తలు పోస్ట్ చేస్తున్నారని సాయి పల్లవి ఈ వార్తలను ఖండించి అసహనం వ్యక్తం చేసింది. దీనితో తన పోస్ట్ అందరిలో వైరల్ గా మారింది.