Ram Charan : ఉక్రెయిన్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కోసం సహాయం అందించిన రామ్ చరణ్…ఫిదా అయిన ఫ్యాన్స్..!

Ram Charan : రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అనేక మంది ప్రాణాలను బలిగొంది. యుద్దానికి ముందు అందమైన దేశంగా ఉన్న ఉక్రెయిన్ ఇపుడు బాంబుల మోతతో శిథిలమైన కట్టడాలతో కళ తప్పి కనిపిస్తోంది. అక్కడ ఉన్న విదేశీయులంతా వారి సొంత దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక అక్కడ చదువుకోసం వెళ్లిన భారతీయులు చాలా మంది తిరిగి వచ్చాక అక్కడి భయంకర పరిస్థితుల గురించి వివరిచడం చూస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఊహించుకోవచ్చు.

ఇక భారతీయ సినిమాలు ఎక్కువగా సౌత్ సినిమాలు అక్కడ షూటింగ్ జరుపుకునేవి. ఉక్రెయిన్ చాలా అందమైన దేశం మొదటిసారిగా 2017 లో విన్నర్ సినిమా ను అక్కడ షూట్ చేసారు ఆ తర్వాత రోబో 2 ఇంకా చాలా చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. పోయిన ఏడాదిలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అక్కడ చిత్రీకరణ జరుపుకుంది. సినిమాలోని నాటు నాటు పాటను అక్కడే చిత్రికరించారు. అక్కడి ఉక్రెయిన్ ప్రజలు కుడా చిత్రంలో భాగస్వాములు అయ్యారు. దీంతో చిత్ర యూనిట్ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.

అయితే ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్కడ పరిస్థితులపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌లో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం చేశానని చెప్పాడు. తాను ఉక్రెయిన్ లో యుద్ధం మొదలైన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైమ్‌లో… అక్కడ నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో మాట్లాడాను. ఆయన తండ్రి, 80 ఏళ్ళ వ్యక్తి గన్ పట్టుకుని యుద్ధంలో పాల్గొంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఫ్యామిలీకి నేను కొంత డబ్బులు పంపించాను. అయితే తాను చేసిన ఆ సహాయం సరిపోదని అన్నారు.. కానీ నేను నా వంతు సహాయం చేశా” అని రామ్ చరణ్  చెప్పారు.

ఉక్రెయిన్ ప్రజలు చాలా ఫ్రెండ్లీ. ప్రొఫెషనల్ అని ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాదు కాదు నాటు నాటు సాంగ్‌లో డ్యాన్స్ స్టైల్ వాళ్ళ డ్యాన్స్ స్టైల్ కాదు.. కానీ వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకున్నారు అంటూ వారితో ఏర్పడిన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, తాను, తమ టీమ్‌లో ఇతర సభ్యులు ఉక్రెయిన్‌లో తమకు తెలిసిన వాళ్ళతో మాట్లాడామని రాజమౌళి వివరించారు.