Sivakarthikeyan: గొప్ప మనసు చాటుకుంటున్న శివ కార్తికేయన్.. ఏడేళ్లుగా సీక్రెట్ గా ఆర్థిక సహాయం!

Sivakarthikeyan: కోలీవుడ్ క్రేజీ హీరో శివ కార్తికేయన్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మొదట్లో స్టార్ హీరోల సినిమాలలో సైడ్ రోల్స్ లో నటించి మెప్పించిన శివ కార్తికేయన్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కేవలం నటనతోనే కాకుండా నిర్మాతగా సింగర్ గా రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శివ కార్తికేయన్ నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల అవుతూ వచ్చింది. కాగా శివ కార్తికేయన్ చివరగా అమరన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచింది.

ఈ సినిమాతో శివ కార్తికేయన్ కి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. అభిమానించే వారి సంఖ్య కూడా మరింత పెరిగింది అని చెప్పాలి. ఇకపోతే శివ కార్తికేయన్ ప్రస్తుతం మద్రాస్ పరాశక్తి అనే సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోస్ శివ కార్తికేయన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏడేళ్ల ముందు చనిపోయిన తమిళ రైతు నాయకుడికి ఇచ్చిన మాట ప్రకారం అప్పటి నుంచి రహస్యంగా సాయం చేస్తున్నారట ఈ హీరో. ఈ విషయాన్ని డైరెక్టర్ ఎరా శరవణన్ ఇటీవలే బయటపెట్టారు.
నా సోదరుడైన నెల్ జయరామన్ కన్నుమూసినప్పుడు అతని కుమారుడి చదువుకు అయ్యే ఖర్చులను తాను భరిస్తానని శివ కార్తికేయన్ హామీ ఇచ్చాడు.

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఏడేళ్లుగా రహస్యంగా సహాయం చేస్తూనే ఉన్నారు. సాధారణంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే కొందరు పరామర్శించి తాము అండగా ఉంటామని హామీలు ఇస్తుంటారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే మాట నిలబెట్టుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో శివ కార్తికేయన్ ఒకరు. నెల్ జయరామన్ కుమారుడైన శ్రీనివాసన్‌ ఏడేళ్లుగా విద్యా ఖర్చులు భరించడమే కాకుండా వార్షిక పరీక్షల సమయంలో ఫోన్ చేసి అతనితో మాట్లాడతారు. శ్రీనివాసన్ ఇప్పుడు కోయంబత్తూరులోని కర్పగం కాలేజీ చదువుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా నిలిచారు అని శివ కార్తికేయన్ పై ప్రశంసలు కురిపించాడు శరవణన్. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు శివ కార్తికేయన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చిన్న సహాయం చేసి వంద మందికి గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో ఏడేళ్లుగా ఇంత మంచి సహాయం చేస్తూ కూడా బయట పెట్టకుండా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం అని కొనియాడుతున్నారు.