Pawan Kalyan: జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా తాజాగా జులై 24న విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభిస్తోంది. ఇకపోతే ఈ సినిమా సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఓపికకు దండంరా స్వామి అంటున్నారు అభిమానులు. ఇలా కూడా కష్టపడతారా అనేలా తిరుగుతున్నారు పవన్. గత నాలుగు రోజులుగా పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు.
సోమవారం నాడు పవన్ ఉదయం హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అది పూర్తికాగానే మళ్ళీ ఉస్తాద్ షూటింగ్ కి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ మధ్యలో ఏపీ ప్రభుత్వ పనులు కూడా చేసారు. ఇక మంగళవారం ఉపముఖ్యమంత్రిగా పనులు చూసుకుంటూనే మధ్యమధ్యలో పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఉదయం మంగళగిరిలో అక్కడి లోకల్ మీడియాతో హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడారు. తాజాగా బుధవారం ఉదయం మంగళగిరిలో హరిహర వీరమల్లు గురించి నేషనల్ మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చి హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ సమస్యలను పరిష్కరించారు. అదే రోజు రాత్రి వైజాగ్ వెళ్లి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఇలా మూడు రోజులుగా ఒక పక్క ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు, మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్, పూర్తిస్థాయిలో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ చేసి రెస్ట్ తీసుకోకుండానే నేడు ఉదయం వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇవాళ సాయంత్రం హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ కోసం హైదరాబాద్ కి రానున్నారు. ఇలా పవన్ వరుసగా గ్యాప్ లేకుండా కష్టపడటంతో నీ ఓపికకు దండం సామీ, పని మీద నీకున్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Pawan Kalyan: పవన్ ఓపికకు దండం అంటున్న ఫ్యాన్స్.. మూడు రోజులు ప్రమోషన్స్.. తెల్లారేసరికి క్యాబినెట్ మీటింగ్!
