RRR: ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఇపుడే తగ్గేలా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ దూసుకుపోతోంది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కష్టమంటూ వార్తలోచ్చిన అందరిని నోరేళ్ళబెట్టుకునేలా చేసేసింది ఈ జక్కన్న చెక్కిన చిత్రం. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అన్ని చోట్ల నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలే అన్న చందంగా దుమ్ములేపుతోంది.
ఇక బాలీవుడ్ లో అయితే మిగతా సినిమాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ వేటలో నేను దిగనంత వరకే అన్నట్టుగా అయిపోయింది బాలీవుడ్ సినిమాల పరిస్థితి.ఇక ఈ సినిమా IMDB రేటింగ్స్ లో ప్రపంచంలో స్థాయి సినిమాల్లో టాప్ 5 ప్లేస్ లో నిలిచినా మొదటిసారి భారతీయ సినిమా అయింది. ఇక ఇపుడు ఏకంగా 1000కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తూ అందరిని ఆనందాశ్చర్యలకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 3వ స్తానంలో నిలిచింది.
ఇక రెండో స్థానంలో రాజమౌళి చెక్కిన బాహుబలి2 సినిమా నిలిచింది. ఇది 1819 కోట్లు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతానికి రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 3వ స్థానంలో ఉంది. ఈ సినిమా అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 1000 కోట్లు వసూళ్లు గ్రాస్ సాధించి దూసుకెళుతోంది.. ఇకో నాలుగో స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ ఉంది. ఈ సినిమా సల్మాన్ కెరీర్ లోనే అత్యధికంగా 969 కోట్లు కలెక్ట్ చేసింది.ఇక ఆర్ఆర్ఆర్ ఇంకా ఎన్ని వండర్స్ చేస్తుందో చూడాలి మరి.ఎక్కడ ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూడు చిత్రాలకు కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు.