ఆర్కే రోజా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితమే. ఆర్కే రోజా చిత్తూరు జిల్లాలో 1972లో జన్మించింది.ఈమె అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాలలో వచ్చిన తర్వాత రోజా గా పేరు మార్చుకుంది.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 100కు పైగా చిత్రాలలో ఇచ్చింది. దాదాపు సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరోల సరసన ఈమె నటించింది.
తరువాత ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజకీయాలలో రాణిస్తుంది. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, విమర్శలను ఎదుర్కొని తనకంటూ ఒక స్థానాన్ని గుర్తింపును సంపాదించుకుంది. మరోవైపు జబర్దస్త్ లోనూ జడ్జిగా చేస్తున్న విషయం తెలిసిందే.
రోజా తమిళంలో వచ్చిన ఆర్కే సెల్వమానీ దర్శకత్వం వహించిన చంబరతి సినిమాతో సినీ రంగంలోకి అడుగు వేశారు. ఈ చిత్రంలో హీరో ప్రశాంత్. తెలుగులో ప్రేమతపస్సు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. తరువాత దర్శకుడైన ఆర్కే సెల్వమనీను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అన్షు మాలిక అనే అమ్మాయి, కృష్ణ కౌశిక్ అనే అబ్బాయి సంతానం.
రోజా రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఇకమీదట సినిమాలలో టీవీ షోలలో నటించడం కష్టం అవుతుందని భావించింది. తన కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.అన్షు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రాబోతుందని ప్రస్తుతం టాలీవుడ్ లో సమాచారం. మొదటి సినిమానే పెద్ద స్టార్ హీరో వారసుడితో చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి అనే సమాచారం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి రోజా కూతురు అన్షు ఏ హీరోతో ఎప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందో వేచి చూడాల్సిందే.