చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై స్పందించిన ఆర్జీవీ.. భారీ కామెంట్స్ చేసిన నెటిజన్లు!

సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి అధికార నేత చంద్రబాబు నాయుడు శాసనసభ నుంచి వాక్ అవుట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సభలో తనకు అవమానం జరిగిందని అనవసరంగా తన భార్య గురించి ప్రస్తావిస్తూ తనని అవమానించారని అందుకే తను సభ నుంచి వాకౌట్ చేస్తూ తిరిగి సీఎం అయిన తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి బయటకు వెళ్లారు.

Rgv | Telugu Rajyamఈ క్రమంలోనే సభ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు సభలో తనకు జరిగిన అవమానాన్ని తెలియజేస్తూ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు.ఇకపోతే చంద్రబాబునాయుడు ఏడ్చిన ఈ వీడియోను వర్మ ఎంతో అద్భుతంగా క్యాష్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నటువంటి పవర్ స్టార్ ఆర్జివి మిస్సింగ్ అనే ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక చంద్రబాబు నాయుడు ఏడుస్తున్న వీడియో క్లిప్ ను కొద్దిగా మార్ఫింగ్ చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఆర్జివి మిస్సింగ్ అని తెలియడంతో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చాడు అంటూ చెప్పుకొచ్చారు.అలాగే ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ కు చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చంద్రబాబు నాయుడు ఏడుపును కూడా ఇలా వాడుతున్నారా ఆర్జివి.. ఇదేం వాడకం.. మీ వాడకం మామూలుగా లేదు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles