నార్త్ లో “ఆదిపురుష్” కి రికార్డ్ నెంబర్ స్క్రీన్స్.!

ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ కూడా రికార్డు ఫిగర్స్ డే 1 కి నమోదు చేయగలిగే చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్లాన్ చేసిన భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి భారీ హైప్ ఉన్న ఈ సినిమా హిందీ మార్కెట్ లో కూడా రికార్డు నంబర్స్ నమోదు చేస్తుంది అని ట్రైలర్ తర్వాత ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కి అయితే నార్త్ బెల్ట్ లో రికార్డు స్థాయి రిలీజ్ దక్కకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క మన ఇండియా లోనే మొత్తం హిందీ థియేటర్స్ 4000 నుంచి 4500 మేర రిలీజ్ కానుండగా నార్త్ లో అయితే ఏకంగా 10,500 కి పైగా స్క్రీన్స్ లో ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఆదిపురుష్ ఏఈ జూన్ 16న మాసివ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది అని చెప్పొచ్చు.

మెయిన్ గా అయితే హిందీ సహా తెలుగులో ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ వసూళ్లు అందుకుంటుంది అని ట్రేడ్ చెప్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో అనేది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు రామాయణం ఆధారంగా తెరకెక్కించగా ప్రభాస్ రామునిగా కృతి సనన్ జానకి దేవిగా సైఫ్ అలీఖాన్ రావణాసుర పాత్రలో అయితే నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వరల్డ్ వైడ్ 3డి, 4డి ఎక్స్ ఫార్మట్స్ లో కూడా రిలీజ్ కాబోతుంది.