వైరల్ : మాసివ్ సెట్ లో గ్రాండ్ గా రవితేజ భారీ చిత్రం.!

టాలీవుడ్ లో తమ స్వయం శక్తి తో అయితే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి ఇన్నేళ్ల కెరీర్ లో రవితేజ ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు మొట్ట మొదటి సారిగా భారీ పాన్ ఇండియా సినిమాతో అయితే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆ సినిమానే “టైగర్ నాగేశ్వరరావు”. స్టూవర్టుపురం లో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతుంది. కాగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇక రవితేజ రీసెంట్ గా రెండు వరుస హిట్స్ అనుకోవడంతో నిర్మాతలు కూడా ఖర్చుకి ఏమాత్రం వెనుకాడడం లేదు. అలా తాజాగా ఓ భారీ షెడ్యూల్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. వైజాగ్ లో ఓ కనీ వినీ ఎరుగని మాసివ్ సెట్ ని అయితే వేసి అందులో షూటింగ్ ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు తెలిపారు.

అంతే కాకుండా ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకా విజువల్స్ కూడా చూపించడంతో అసలు ఇదంతా సెట్ వర్క్ తో చేసిందేనా లేక సహజంగా ఉన్నదా అన్నట్టు గా ఉంది. మొత్తానికి అయితే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.

మరి ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.