క్రేజీ : నెక్స్ట్ మూవీకి ఇంత హైప్ ఎక్కించావ్ ఏంటి చరణ్.!

Ram-Charan-RRR

ఇప్పుడు పాన్ ఇండియా నుంచి గ్లోబల్ సినిమా దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పటికప్పుడు మరోసారి ఇండియన్ సినిమా ని గాని తెలుగు సినిమా ప్రతిష్ట ని కానీ ఓ రేంజ్ లో నిలబెడుతున్న చరణ్ లేటెస్ట్ గా ఇండియా తుడట వారు నిర్వహించిన ఓ ప్రిస్టేజియస్ సమిట్ లో అయితే తాను నిన్న పాల్గొన్నాడు.

నరేంద్ర మోడీ సచిన్ లాంటి దిగ్గజాలతో చరణ్ కి ఈ మీటింగ్ లో చోటు దక్కి పాల్గొనడం విశేషం. కాగా ఈ సమితి లో అయితే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా పై కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో క్రేజీ గా మారింది. తాను దర్శకుడు బుచ్చి బాబు సానా తో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో నటుడుగా ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమా “రంగస్థలం” ని మించి ఉంటుంది అని క్రేజీ స్టేట్మెంట్ ని ఇచ్చాడు. దీనితో రంగస్థలం సినిమానే ఓ వండర్ అంటే దానిని మించి ఇది ఉంటుంది అని చరణ్ చెప్పడం మరిన్ని అంచనాలకి దారి తీసింది.

అంతే కాకుండా ఈ సినిమా విషయంలో అయితే నేను చాలా క్లారిటీ గా ఉన్నానని ఖచ్చితంగా ఇది కూడా గ్లోబల్ వైడ్ గా రీచ్ అందుకునే పొటెన్షియల్ ఇందులో ఉందని అయితే చరణ్ తెలిపాడు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి సినిమా స్టార్ట్ చేస్తామని తాను తెలిపాడు. దీనితో ఈ సినిమా విషయంలో చరణ్ చెప్పిన మాటల తాలూకా హైప్ నెక్స్ట్ లెవెల్ కి మారింది.