Ram Charan-Upasana: ట్రోలర్స్ కు గట్టిగా ఇచ్చిపడేసిన ఉపాసన.. అలా చేస్తే తప్పేంటి అంటూ!

Ram Charan-Upasana: టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కడపలో దర్గా ను సందర్శించిన విషయం తెలిసిందే. 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి సమీపంలోని విజయ దుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన రాబోయే సినిమా స్క్రిప్టును అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

అయితే రామ్ చరణ్ ఆ దర్గాకు వెళ్లకు ముందు నుంచే అయ్యప్ప మాలను ధరించిన విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట మేరకు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పటికీ కడప దర్గాను దర్శించుకున్నారు రామ్ చరణ్. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ ఈ విషయం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పై నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై మెగా పవర్ స్టార్ స్పందించకున్నా ఆయన సతీమణి ఉపాసన కొణిదెల స్పందించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది.

తన సోషల్ మీడియా ఖాతాలో ఉపాసన తన భర్త చరణ్ దర్గాలో ప్రార్థనలు చేస్తోన్న ఫొటోను షేర్‌ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించింద ఉపాసన దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుంది. అంతే కానీ చిన్నాభిన్నం చేయదు. భారతీయులుగా మేం అన్ని మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తాము. ఐక్యతలోనే మా బలం ఉంది. రామ్‌ చరణ్‌ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తుంటారు అని రాసుకొచ్చింది ఉపాసన. దీనికి ‘వన్‌ నేషన్‌.. వన్‌ స్పిరిట్‌’ అని హ్యాష్‌ ట్యాగ్ కూడా జోడించింది మెగా కోడలు. అయితే ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో మెగా అభిమానులు అలాగే నెటిజన్స్ ఉపాసనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.