Srikanth Iyengar: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న నటల్లో శ్రీకాంత్ అయ్యంగర్ కూడా ఒకరు. కమెడియన్ గా విలన్ గా సహాయక నటుడి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా తెలుగులో రాంగోపాల్ వర్మ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యారు శ్రీకాంత్. ఇకపోతే ఇటీవలే ఆయన నటించిన పొట్టేల్ సినిమా ఈవెంట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జర్నలిస్టులు, రివ్యూయర్లను బూతులు తిడుతూ రెచ్చిపోయారు.
దీంతో జర్నలిస్ట్ సంఘాలు ఆయనపై మండి పడ్డాయి. దీంతో దిగివచ్చిన అయ్యంగర్ వారికి క్షమాపణలు చెప్పాడు. ఇలా నిత్యం సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోన్న శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు ఆడియెన్స్ కు మరో షాక్ ఇచ్చారు. ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతితో కలిసి ఆయన ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తనకు జ్యోతి ముద్దు పెడుతోన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీకాంత్.. క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? అంటూ క్రేజీ క్యాప్షన్ ను రాసుకొచ్చారు.
అయితే శ్రీకాంత్ అయ్యంగర్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది శ్రీకాంత్, జ్యోతిలకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో పెళ్లి ఏంటి సిగ్గుగా అనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మనవళ్లను మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో పెళ్లి అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.