సౌత్ లో చరణ్ సెన్సేషన్..సోషల్ మీడియాలో భారీ రికార్డు.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో తెలిసిందే. తన గత చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) గ్లోబల్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్న తాను అక్కడ నుంచి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటూ వచ్చాడు.

అయితే ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లలో చరణ్ 2020 లో ఈంటర్ కాగా రావడంతో రికార్డులు స్టార్ట్ చేసాడు. ఇక ఇప్పుడు ఇన్స్టా లో అయితే సౌత్ లో ఇప్పటికొచ్చి ఏ స్టార్ హీరో కూడా కొట్టని భారీ రికార్డు తాను తన సొంతం చేసుకున్నాడు.

లేటెస్ట్ గా చరణ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో 1 కోటి ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. మరి దీనితో అయితే టాలీవుడ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఫాస్టెస్ట్ హీరోగా చరణ్ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లో కూడా ఏ రికార్డు అందుకున్న హీరోగా చరణ్ ఇప్పుడు నిలిచాడు.

ఇక ప్రస్తుతం అయితే చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా నెక్స్ట్ నిన్ననే దర్శకుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఓ భారీ సినిమాని అయితే అనౌన్స్ చేసాడు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది.