ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ ఫ్రెండ్స్ తో కలిసి చరణ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడట.!

తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదటగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. మరి ఇప్పుడు ప్రభాస్ తర్వాత నుంచి ఇదే పాన్ ఇండియా మార్కెట్ లో ముద్ర వేసుకున్న మరో స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

కాగా ప్రభాస్ కి చరణ్ కు కూడా మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోస్ పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ అయితే సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రభాస్ ఇది వరకే తన  ఫ్రెండ్స్ వంశీ ప్రమోద్ లను నిర్మాతలుగా తీసుకొచ్చి యూవీ క్రియేషన్స్ అనే బ్యానర్ ని సెట్ చేసిన సంగతి తెలిసిందే.

మరి వీరితో ఇప్పుడు రామ్ చరణ్ కలిసి వర్క్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. చరణ్ ప్రభాస్ ఫ్రెండ్స్ కలిసి ఓ కొత్త నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. దీనికి ‘వి మెగా ప్రొడక్షన్ హౌస్’ అనే పేరు కూడా పెట్టారట. కాగా దీని నుంచి అయితే ప్రస్తుతం ఉన్న కొత్త జెనరేషన్ లో యంగ్ టాలెంట్ ని తమ బ్యానర్ ద్వారా పరిచయం చేయడం మంచి సినిమాలు అందించాలనే ప్లాన్ తో ఇలా వస్తున్నారట.

అంతే కాకుండా ఈ బ్యానర్ నుంచి అయితే పలు పాన్ ఇండియా సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ ఇంట్రెస్టింగ్ కలయిక బాగుంది. మరి వీరి నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. ఇక ఇపుడు రామ్ చరణ్ తన “గేమ్ చేంజర్” లో బిజీగా ఉండగా ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ తో అయితే రాబోతున్నాడు.