HomeNewsరాజమౌళి నే ఆలియా భట్ ని ముంబై పంపించేశాడు..!

రాజమౌళి నే ఆలియా భట్ ని ముంబై పంపించేశాడు..!

రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా ఈ భారీ మల్టీస్టారర్ లో చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఫిక్షన్ కథాంశంతో దేశ భక్తి ప్రధానంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు.

Whatsapp Image 2021 02 23 At 6.51.03 Pm | Telugu Rajyam

కాగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో ఆలియా భట్ పాల్గొనగా కీలకమైన కొన్ని సీన్స్ తో పాటు సాంగ్స్ ని కంప్లీట్ చేశాడట రాజమౌళి. ఇంకా ఆలియా భట్ పాల్గొనాల్సిన సీన్స్ మిగిలి ఉండగా ఈ సినిమా కోసం ముందు ఆలియా కేటాయించిన డేట్స్ ఇప్పుడు వేస్ట్ అయినట్టు సమాచారం. మళ్ళీ ఆ డేట్స్ ని ఏప్రిల్ లో సర్దుబాటు చేయమని ఆలియాని రాజమౌళి కోరినట్టు తెలుస్తోంది. అందుకు కారణం చరణ్ అంటున్నారు. చరణ్ వల్ల ఆలియా డేట్స్ మళ్ళీ ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించాల్సి వస్తుందట.

చరణ్ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి లోని మారేడు మిల్లి ఫారెస్ట్ లో సాగుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర ముందు కేవలం 25 నుంచి 30 నిముషాలే అయినప్పటికి ఆ తర్వాత గంట వరకు చరణ్ క్యారెక్టర్ ని డెవలప్ చేశాడట కొరటాల. దాంతో చరణ్ ముందు కేటాయించిన డేట్స్ కంటే ఎక్కువ రోజులు ఇప్పుడు ఆచార్య కి అవసరం పడుతుందని అందుకే ఆర్ఆర్ఆర్ మార్చ్ లో కంప్లీట్ కావాల్సింది ఏప్రిల్ వరకు పొడగించడంతో రాజమౌళి ఆలియాని ముంబై పంపించేసినట్టు తెలుస్తోంది. మళ్ళీ ఆలియా డేట్స్ ఏప్రిల్ లో ఇచ్చినట్టు సమాచారం.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News