టోటల్ సౌత్ ఇండియాలోనే అలా.. దీప్తి సునయన లవర్‌పై రఘు మాస్టర్ కామెంట్స్

raghu Master praise Shanmukh In Dance plus

యూట్యూబ్ స్టార్స్ గురించి అందరికీ తెలియకపోవచ్చు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన వారు చాలా తక్కువ మంది. అందులో షణ్మఖ్ ఒకడు. అయితే షణ్ముఖ్ అంటే అందరూ అంత ఈజీగా గుర్తు పడతారో లేదో గానీ.. దీప్తి సునయన ఫ్రెండ్, లవర్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. ఒకప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేసిన కవర్ సాంగ్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ షోలో దీప్తి సునయన తన లవర్ కమ్ ఫ్రెండ్ అయిన షణ్ముఖ్ గురించి చెబుతూ ఎన్నో సార్లు ఎమోషనల్ అయింది.

raghu Master praise Shanmukh In Dance plus
raghu Master praise Shanmukh In Dance plus

అలా షణ్ముఖ్ పేరు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం షణ్ముఖ్ తనకంటూ ఓ బ్రాండ్‌ను ఏర్పర్చుకున్నాడు. యూట్యూబ్‌లో కొత్త కొత్త వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అవుతున్నాడు. మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ డెవ‘లవ్’పర్ అనే వెబ్ సిరీస్‌తో యూట్యూబ్ సెన్సేషన్‌గా మారాడు. ఏకంగా ఈ సిరీస్‌తో ఇండస్ట్రీ పెద్దల కంట్లో షణ్ముఖ్ పడ్డాడు. ప్రతీ ఒక్క ఎపిసోడ్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

అలా లాక్డౌన్ కాలంలో షణ్ముఖ్ పేరు ఓ రేంజ్‌లో మార్మోగిపోయింది. అలాంటి షణ్ముఖ్ డ్యాన్స్ ప్లస్ షోలో ఓ పర్ఫామెన్స్ చేశాడు. ఆ సందర్భంగా రఘు మాస్టర్ అతని గురించి అసలు విషయాలు చెప్పుకొచ్చాడు. గతేడాది అత్యంత ప్రభావశీలురా జాబితా తీస్తే అందులో సౌత్ నుంచి వచ్చిన ఒకే ఒక్క పేరు షణ్ముఖ్. ఎంతో మంది స్టార్స్ ఉన్నా కూడా వారి గురించి కాకుండా షణ్ముఖ్ గురించి మాట్లాడుకున్నారంటే నిజంగా గ్రేట్ అంటూ రఘు మాస్టర్ ప్రశంసలు కురిపించాడు.