దసరా స్పెషల్ ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ షణ్ముఖ్.. కారు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

యూట్యూబర్ గా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు షణ్ముఖ్ జస్వంత్.ఇలా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వెళ్లారు.ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళగానే అందరికీ ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి తప్పకుండా ట్రోఫీ షణ్ముఖ్ గెలుచుకుంటారని అభిమానులు భావించారు. అయితే ఈయన మాత్రం బిగ్ బాస్ హౌస్ లో సిరితో కలిసి పెద్ద ఎత్తున ముచ్చట్లు పెట్టుకుంటూ కార్యక్రమాన్ని చాలా నెగ్లెట్ చేయడం వల్ల కేవలం రన్నర్ గా మాత్రమే మిగిలారు..

ఇక బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ జస్వంత్ సిరితో వ్యవహరించిన తీరు పట్ల లవ్ బ్రేకప్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున నెగిటివిటీ మూటగట్టుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఈయనకి బాగా నెగిటివిటీ వచ్చిందని చెప్పాలి. ఈ కార్యక్రమం అనంతరం షణ్ముఖ్ మరి వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇకపోతే తాజాగా ఈయన ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలోనే కారుతో కలిసి దిగిన ఫోటోలను షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ తాను కలల కన్నా కారు కొనుగోలు చేశాను ఇప్పటికీ ఇది కలగానే ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి గల కారణం తన పేరెంట్స్ అలాగే మీరంతా (ఫ్యాన్స్) కారణమని ఈయన వెల్లడించారు. షణ్ముఖ్ కారు కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈయన బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కి చెందిన ఆ కారు ధర రూ. 51 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నటు వంటి షన్ను ఎప్పుడు కనిపించిన చెప్పండి తప్పకుండా లిఫ్ట్ ఇస్తానంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.