బ్రేకప్ తర్వాత తొలిసారిగా అక్కడ కలుసుకున్న షణ్ముఖ్, దీప్తి సునయన!

యూట్యూబ్ అనేది ప్రస్తుత కాలంలో టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తిని పాపులర్ చేసింది. ఇంతకుముందు నటన అంటే ఆసక్తి ఉన్నవారు ఒక్క అవకాశం కోసం తెగ ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు మాత్రం అలా కాదు. తమలో టాలెంట్ ఉంటే యూట్యూబ్ ద్వారా తమను తాము గుర్తింపు తెచ్చుకోవచ్చు. అలా గుర్తింపు తెచ్చుకొని.. ప్రేమించుకొని.. బ్రేకప్ చెప్పుకున్న షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైన ల గురించి ఇప్పుడు చూద్దాం.

షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ లో డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ లు చేసి చాలా ఫేమస్ అయ్యాడు. ఇతనికి దాదాపుగా నాలుగు మిలియన్లకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. మరొకవైపు దీప్తి సునైనా కూడా యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొందింది.

వీరిద్దరూ కలిసి కొన్ని షార్ట్ ఫిలిం లో నటించడం ద్వారా వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.
దీప్తి సునైన బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్లి అలరించిన విషయం అందరికీ తెలిసిందే. వీరి ప్రేమాయణం కాస్త దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది. ఇద్దరు కలిసి మంచి క్రేజ్ ఉన్న లవర్స్ గా యూట్యూబ్లో గుర్తింపు కూడా పొందారు.

తరువాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా వెళ్లి అలరించాడు షణ్ముఖ్ జస్వంత్. ఈ సమయంలోనే కొన్ని మనస్పర్ధ కారణాలవల్ల దీప్తి సునైన బ్రేకప్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో వైజాగ్ లో ఒక ఈవెంట్లో వీరిద్దరూ పాల్గొనడం జరిగింది. అక్కడ వీరు మాట్లాడుకున్నారంటూ వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

వీరిద్దరూ కలిసి పనిచేసే ఇన్ఫినిటీ నెట్వర్క్ వాళ్లు ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వీరిద్దరూ పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఎవరి యూట్యూబ్ ఛానల్ లో వాళ్లు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తున్నారు.