కన్నడలో “పుష్ప 2” కి గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట.!

ఇపుడు పాన్ ఇండియా మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్న అవైటెడ్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ తో అల్లు అర్జున్ చేసిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప కి సీక్వెల్ గా వస్తున్నా ఈ సినిమాపై సెన్సేషనల్ హైప్ ని నెలకొంది.

ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కూడా కంప్లీట్ అవుతుండగా రీసెంట్ గానే అయితే ఈ చిత్రం నటులు కొందరు యాక్సిడెంట్ కి కూడా గురయ్యారు. ఇక ఇదిలా ఉండగా మరోపక్క ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా టాక్ ఉండగా ఈ సినిమా కన్నడ బిజినెస్ పై లేటెస్ట్ గా షాకింగ్ బజ్ అయితే వినిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా పుష్ప 2 కి కన్నడ లో నాన్ RRR రికార్డులు సెట్ చేయనున్నట్టుగా అంటున్నారు. అయితే కన్నడ లో హక్కులకు గాను మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ ఈ సినిమాకి 30 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ కన్నడ డిస్ట్రిబ్యూస్టర్స్ మాత్రం కేవలం 20 కోట్లు ఇస్తామని చెప్తున్నారట.

దీనితో ఈ చిత్రం కి మేకర్స్ అడిగిన మొత్తం గాని ఇస్తే మాత్రం నాన్ RRR రికార్డు నమోదు అయ్యినట్టే అని అంటున్నారు. కాగా RRR కి అయితే హైయెస్ట్ గా 32 కోట్లు పలికినట్టుగా సమాచారం. ఇక పుష్ప 2 లో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాదిలో అయితే ఈ సినిమా రిలీజ్ ఉండనుంది.