పూరి – విజయ్ ల రెండో భారీ చిత్రం రిలీజ్ ఈరోజే!

గత ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ లు గాని అలాగే బిగ్గెస్ట్ లాసులు వచ్చిన చిత్రాలు కానీ మళ్ళీ ఒకే ఏడాదిలో ఎప్పుడు రాలేదు అని చెప్పాలి. మెయిన్ గా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “లైగర్” కొట్టిన దెబ్బ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి ఇంకా తగ్గలేదు.

మరి నష్టాలు ఇంకా పూడ్చారో లేదో కానీ ఈ సినిమా పెద్ద హిట్ అయిపోతుంది అని నమ్మకంతో ఇంకా లైగర్ రిలీజ్ కాకముందే అనౌన్స్ చేసేసిన రెండో భారీ చిత్రమే “జనగణమన”. ఈ చిత్రం ఎప్పుడు నుంచో పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ అంటూ దీనిని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలి అనే లక్ష్యంతో పూరి జగన్నాథ్ అప్పుడు ఉండేవాడు.

కానీ తర్వాత అయితే ఫైనల్ గా విజయ్ దేవరకొండ దగ్గరకి వచ్చింది. హీరోయిన్ పూజా హెగ్డేగా గత ఏడాదిలో అనౌన్స్ చేసిన ఈ చిత్రం సరిగ్గా ఇదే ఆగస్ట్ 3న రిలీజ్ కి అప్పుడే ఫిక్స్ చేసేసారు. అంటే అన్నీ సెట్ అయ్యి ఉంటే ఈ శుక్రవారం థియేటర్స్ లో ఈ భారీ ప్రాజెక్ట్ పడి ఉండేది.

కానీ లైగర్ దెబ్బతో అయితే అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే భారత్ ఆర్మీతో కలిసి విజయ్ కొన్ని ట్రిప్ లు ఫోటోలు అబ్బో ఆ సందడి వేరే లెవెల్లో ఉండేది. కానీ ఫైనల్ గా ఈ చిత్రం నిలిచిపోయింది. మరి మళ్ళీ పూరి ఈ చిత్రాన్ని ఎవరితో చేస్తాడో చూడాలి.