సూపర్ స్పీడ్ లో కనిపిస్తున్న “డబుల్ ఇస్మార్ట్”.. కానీ 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కూడా ఒకటి. కాగా తమ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా దీనిని అనౌన్స్ చేయగా పూరి జగన్నాథ్ తన మార్క్ స్పీడ్ లో అయితే ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు.

దీనితో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా లైగర్ లాంటి పాన్ ఇండియా ప్లాప్ వచ్చినప్పటికీ కూడా దీనిని కూడా పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేసి సిద్ధం చేస్తున్నారు. అయితే హిందీలో ఇస్మార్ట్ శంకర్ కి భారీ రెస్పాన్స్ ఉంది. అందుకే దీనిని కూడా సిద్ధం చేస్తుండగా ఈ చిత్రం కోసం అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరి రామ్ ని మాస్ హీరోగా నిలబెట్టిన ఇస్మార్ట్ శంకర్ ఈసారి డబుల్ మాస్ గా ఉంటుంది అని మేకర్స్ కూడా చెబుతూనే సినిమా పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గానే సినిమా మ్యూజిక్ పనులు కూడా జెట్ స్పీడ్ లో నడుస్తున్నట్టుగా సంగీత దర్శకుడు మణిశర్మతో కలిసి పూరి జగన్నాథ్ పోస్ట్ చేసిన పోస్ట్ లు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఎప్పుడో మార్చ్ 8 అని మేకర్స్ ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి కానీ రిలీజ్ డేట్ ని ఎక్కడా మెన్షన్ చేసినట్టు కనిపించడం లేదు. దీనితో ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా అని మరి దీనిపై క్లారిటీ కోసం రామ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.