మొన్నామధ్య ఓ డిజాస్టర్ సినిమా చేశాడు ఆ హీరో.! ఇంతలోనే, ఇంకో డిజాస్టర్. డిజాస్టర్ మీద డిజాస్టర్లు ఇస్తూ నిర్మాతల్నీ, బయ్యర్లనీ ముంచేస్తున్నాడు ఆ హీరో. సదరు హీరో విషయమై నిర్మాతలూ గుస్సా అవుతున్నారు. కానీ, మార్కెట్‌లో అతనికి వున్న డిమాండ్ నేపథ్యంలో, అతని వెంట పడటక తప్పడంలేదు.
అయితే, తాజా డిజాస్టర్ నేపథ్యంలో కొంత సొమ్ముని వెనక్కివ్వడానికి సదరు హీరో చూచాయిగా ఒప్పుకున్నాడట. అది కూడా చాలా తక్కువ మొత్తమేనట. ఎలాగైతేనేం, ఎంతో కొంత అతన్నుంచి రావడంతో సదరు నిర్మాతతోపాటు, బయ్యర్లూ ఊపిరి పీల్చుకుంటున్నారట.
మరోపక్క, ఈ విషయం తెలిసి గతంలో చేసిన సినిమా వల్ల నష్టపోయి బయ్యర్లు, నిర్మాత కూడా సదరు హీరోపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, తదుపరి సినిమాలకు సంబంధించి బిజినెస్, బడ్జెట్ వంటి విషయాల్లో కొన్ని కోతలు పెడుతున్నారట ఆయా సినిమాల నిర్మాతలు.
మామూలుగా అయితే, ఆ హీరోకి డబ్బు యావ ఎక్కువ. ‘ఏం, నా ఇమేజ్‌తో డబ్బు సంపాదిస్తున్నారు కదా.? హిట్టొస్తే జేబులో వేసుకుంటారు, ఫ్లాపొస్తే నన్ను అడుగుతారా.?’ అనే ఆటిట్యూడ్ అట ఆ హీరోది. కానీ, ఇప్పడిక మారక తప్పలేదు.
మార్కెట్‌లో తన ఇమేజ్ డ్యామేజ్ అయిపోకూడదని ఇప్పుడిప్పుడే కాస్త ఆలోచనలు మార్చుకుంటున్నాడట. చిరంజీవి లాంటి హీరోనే నిర్మాతల విషయంలో ‘సాయం’ చేస్తున్నప్పుడు, తాను అలా చేయకపోతే బావుండదన్నది సదరు హీరోకి కలిగిన జ్ఞానోదయమట.