సలార్.. డబుల్ యాక్షన్ లో ఊచకోత!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్లీ సరైన సక్సెస్ చూడలేదు. అందుకే ఇప్పుడు సలార్ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకునే ట్రాక్లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ సినిమాపై కావాల్సినంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెంచేసాయి.

ఇక సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ అలాగే ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక లీక్స్ ప్రకారం ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎలివేషన్ కూడా ఊహించని విధంగానే ఉంటుందట. ముఖ్యంగా ఇందులో ఇద్దరు ప్రభాస్ లు ఉండబోతున్నట్లుగా ఇదివరకే ఒక బలమైన టాక్ అయితే వినిపించింది.

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకే ఫ్రేమ్ లో తండ్రి కొడుకులుగా ఇద్దరు ప్రభాస్ లను హైలైట్ చేసే సన్నివేశం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని మరొక టాక్ వైరల్ అవుతుంది. వెయ్యి మందితో ఇందులో ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్ అయితే ఉంటుందట. ఇక అందులో ఒక ప్రభాస్ ఫైట్ చేస్తూ ఉండగా హఠాత్తుగా మరో ప్రభాస్ వస్తాడని తెలుస్తోంది.

అతనికి సహాయంగా ఉంటు ఆ సన్నివేశంలో మిగిలిన రౌడీలను ఊచకోస్తాడట. ఇక మొత్తంగా అయితే బాహుబలి సినిమాలో ఇద్దరు ప్రభాస్ లు కనిపించినప్పటికీ ఓకే ఫ్రేమ్ లో అయితే కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు సలార్ సినిమాలో మాత్రం ఫ్యాన్స్ కు ఇద్దరు ప్రభాస్ లు అలా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారట. దర్శకుడు ప్రభాస్ స్టార్ ఇమేజ్ ను ఈ సినిమాలో మాత్రం గట్టిగా వాడుకున్నట్లుగా తెలుస్తోంది. మరి సినిమా వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.