‘సలార్‌’ డేట్‌ ఫిక్స్‌… డిసెంబర్‌లో షారుఫ్‌ఖాన్‌తో ప్రభాస్‌ పోటీ!?

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి ‘సలార్‌’ బాక్సాఫీస్‌ లెక్కల గురించి మాట్లాడుకునే వాళ్లం. సోషల్‌ మీడియా మొత్తం ప్రభాస్‌ ఎలివేషన్‌ల వీడియోలతో నిండిపోయి ఉండేది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సహా ఆడియెన్స్‌ అంతా ‘సలార్‌’ ఫీవర్‌లో మునిగిపోయే వారు.

కానీ రిలీజ్‌కు రెండు వారాల ముందు చావు కబురు చల్లగా అన్న రీతిలో హోంబలే సంస్థ పోస్ట్‌ పోన్‌ అంటూ ప్రభాస్‌ ఆశలపై నీళ్లుజల్లింది. ఇక అలా పోస్ట్‌ పోన్‌ అంటూ అఫీషియల్‌ ప్రకటన వచ్చిందో లేదో.. నవంబర్‌లో రిలీజ్‌ అని, డిసెంబర్‌లో రిలీజ్‌ అని కొత్త డేట్‌లు పుట్టుకొచ్చాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్‌ 22న సినిమా పక్కా వస్తుందన్న వార్త సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసింది.

కాగా తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌పై అఫీషియల్‌ ప్రకటన ఇచ్చేశారు. వారం నుంచి వస్తున్న రూమర్స్‌నే నిజం చేస్తూ డిసెంబర్‌ 22వ డేట్‌ను లాక్‌ చేసుకున్నట్లు వెల్లడిరచారు. ఈ మేరకు ఓ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ను కూడా దింపారు. చేతిలో పదునైన కత్తి పట్టుకుని ఒళ్లంతా రక్తంతో నిండిన ప్రభాస్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. కాగా అదే రోజున డుంకీ సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే పఠాన్‌, జవాన్‌ వంటి ఇండస్ట్రీహిట్‌లతో జోరు మీదున్న షారుఖ్‌ ఖాన్‌ డుంకీతో హ్యాట్రిక్‌ కొట్టాలని కసితో ఉన్నాడు.

సౌత్‌ మట్టుకు ప్రభాస్‌ యునానిమాస్‌గా కోట్ల వరద పారిస్తానడంలో సందేహం లేదు.. కానీ నార్త్‌లో మాత్రం షారుఖ్‌ గట్టి పోటీనిస్తాడు. అదీ కాకుండా అదే రోజున ఆక్వామెన్‌ ఫాలెన్‌ కింగ్‌ డం కూడా రిలీజవుతుంది. ఇక్కడ దీనివల్ల పెద్దగా పోటీ లేదు కానీ.. ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా సలార్‌కు గట్టి పోటినిస్తుంది. షారుఖ్‌కు సైతం ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది.

వీటి వల్ల సలార్‌ ఓవర్సీస్‌ కలెక్షన్‌లు దెబ్బతినే చాన్స్‌ ఉంది. అయితే రిలీజ్‌కింకా ఎలాగో నాలుగునెలలు టైమ్‌ ఉంది గనుక.. ఇప్పటి నుంచి సరైన్‌ ప్లానింగ్‌ చూసే ఓవర్సీస్‌లో ప్రమోషన్‌లు గట్రా చేస్తే సలార్‌కు సాలిడ్‌ ఓపెనింగ్స్‌ రావడం ఖాయం అని చిత్ర యూనిట్‌ భావిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ సీజీ వర్క్‌తో పాటు క్లైమాక్స్‌కు సంబంధించి కొన్ని కీలక రిపేర్లు చేస్తున్నాడట.

ఇక ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌ ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్‌ తెచ్చుకుంది. డైనోసర్‌ ముందు ఏదైనా దిగదుడుపే అన్న రేంజ్‌లో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు గూస్‌బంప్స్‌ అన్న మాట కూడా చిన్నదైపోయింది. ఇక డార్లింగ్‌ బర్త్‌డే సందర్భంగా ఓ బ్లడ్‌ బాత్‌ టీజర్‌ను చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌.