ఈ మధ్యకాలంలో సినిమాలు రాజకీయం, రాజకీయమే సినిమాలుగా మారిపోయాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో మన టాలీవుడ్ సెలబ్రిటీలు వివిధ పార్టీలలో కీలక నాయకులుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఉంటే, బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా, రోజా వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు.
ఇక సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైసీపీలో జగన్ విధేయుడుగా ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. జగన్ ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే మీడియా ముందుకి వచ్చేసి వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం పోసాని నైజం. గతంలో పవన్ కళ్యాణ్ మీద ఏకంగా పెళ్ళాలు అంటూ, అలాగే సీనియర్ నటులు అంటే గౌరవం లేదంటూ తీవ్ర స్థాయిలో దూషించారు.
ఆ తరువాత నుంచి పోసానికి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం జగన్ పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక ఈ పదవి చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా చిన్న సినిమాలు రిలీజ్ కి సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణపై పోసాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
జగన్ ని బాలకృష్ణ సైకో అనడంపై రియాక్ట్ అయిన పోసాని నిజమైన సైకో బాలకృష్ణ అని అన్నారు. ఇంట్లోనే ఇద్దరిని కాల్చిన బాలకృష్ణ సైకోనా? జగన్ సైకోనా? ఇంట్లో వాచ్ మెన్ చనిపోతే లెక్క చేయకుండా షూటింగ్ కి వెళ్ళిపోయినా బాలకృష్ణ సైకోనా కాదా? స్టేజ్ మీద అమ్మాయిలకి కడుపులు చేయాలంటూ కామెంట్స్ చేసిన బాలకృష్ణ సైకోనా కాదా. ఎప్పుడైనా జగన్ ఇలాంటి మాటలు మాట్లాడారా.
పబ్లిక్ లో జనాలని కొట్టేవాడు సైకోనా కాదా? జగన్ అలా ఎప్పుడైనా జనంతో తప్పుగా ప్రవర్తించాడా అంటూ తీవ్ర స్థాయిలోనే పోసాని విమర్శలు చేశారు. ఇక ఇదే మీటింగ్ లో టెంపర్ సినిమాకి తనకి నంది అవార్డు ఇచ్చినపుడు అది కమ్మ నందిగా కనిపించింది అని, అందుకే తీసుకోలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే పోసానిపై విమర్శలు వస్తున్నాయి.