Pavan kalyan : అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాని ఎందుకు పవన్ వద్దనుకున్నాడో….!

Pavan Kalyan : పవన్ కళ్యాణ్ పూరి కాంబినేషన్ లో వచ్చిన బద్రీనాథ్ సినిమా బ్లాకబస్టర్ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత పూరి పవన్ కోసం మూడు కథలను సిద్ధం చేసాడు. అందులో ఒకటి 2001 లో ఇడియట్ సినిమా. దీని పవన్ కాదంటే రవితేజతో ఈ సినిమా తీసాడు పూరీ. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ హిట్ అందుకని రవితేజ కు సినిమా కెరీర్ ను మలుపు తిప్పింది. అలా పరోక్షంగా రవితేజ తెలుగు హీరోగా నిలదొక్కుకోవడానికి పవన్ కారణమయ్యాడు.

ఇక 2002 లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాను పవన్ కే మొదట వినిపించాడు జగన్. అయితే ఆ సినిమా ను పవన్ ఒకే చేయలేదు దీంతో ఈ సినిమాను కూడా రవితేజ తో తీసి మరో హిట్ అందుకున్నాడు పూరీ. ఇక మూడోసారి 2003 లో అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా కథ కూడా పవన్ కి చెప్పాడట పూరీ. అయితే ఈ సినిమాను పవన్ కొంతకాలం అలాగే ఉంచి చివర్లో వద్దనేసాడట పవన్ కళ్యాణ్.

ఇక ఈ సినిమాకు నో చెప్పడానికి పవన్ కు మెయిన్ రీజన్ ఆ సినిమాలో బాక్సింగ్ నేపథ్యంలో ఉండటమే ఆల్రెడీ బాక్సింగ్ నేపథ్యంలో తమ్ముడు సినిమా తీసి మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాతే మళ్ళీ కామిక్ టైమింగ్ వాళ్ళ హిట్ కొట్టాడు. ఈ కారణంతో మళ్ళీ ఆ సబ్జెక్టు జోలికి వెళ్ళకూడదని పవన్ వద్దని చెప్పాడట.కానీ ఆ సినిమా పెద్ద హిట్. రవితేజ తో పూరీ ఈ సినిమా తీసి హ్యాట్రిక్ కొట్టాడు. 2003 వ సంవత్సరం ఏప్రిల్ 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. 55 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది ఈ మూవీ. ఈ చిత్రం విడుదలై 19 వసంతాలు పూర్తిచేసుకుంది . అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తే ఎలా ఉండేది, ఇంకెంత పెద్ద హిట్ అయ్యేది అనే ఆలోచన అందరిలోనూ మెదులుతూనే ఉంటుంది.