ఇద్దరు మాస్ గాడ్ లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నందమూరి నటసింహ బాలకృష్ణ లు ఒకే వేదిక మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓటిటి పాపులర్ యాప్, ఆహా లో మరింత పాపులర్ షో అయినటువంటి అన్ స్టాప్పబుల్ 2 ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ తో కంప్లీట్ అయ్యిపోయింది. మరి బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సాలిడ్ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాగ గత వరం వచ్చిన ఈ షో మొదటి ఎపిసోడ్ రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక రెండో ఎపిసోడ్ ని నిన్ననే మేకర్స్ రిలీజ్ చేయగా ఇందులో పొలిటికల్ టచ్ తో చేయగా బాలయ్య సూటి ప్రశ్న కి అయితే పవన్ ధీటైన సమాధానం ఇవ్వడం ఇప్పుడు సినీ వర్గాలు మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ ని తమ టీడీపీ పార్టీ లో ఎందుకు జాయిన్ అవ్వలేదు కొత్త పార్టీ ఎందుకు పెట్టుకున్నావు అని బాలయ్య అడగ్గా పవన్ దానికి చాలా విపుల వివరణ అయితే అందించాడు.
తానెప్పుడూ అధికారం కొందరికి మాత్రమే పరిమితం అయ్యి ఉండకూడదు అని అనుకుంటానని చాలా కింద స్థాయి వ్యక్తులకి కూడా అధికార సాధికారత కావాలని కోరుకునే బలమైన వ్యక్తిని అని ఇప్పుడు కొన్ని ప్రభుత్వాల్లో ఎలా ఉంటాయి అంటే నిమ్న కులంలో ఉన్నవారికి పదవులు ఇస్తారు కానీ అవి నామ మాత్రమే అని వారిని వాటిలో ఉంచి పైకి పెద్దలే దాన్ని కంట్రోల్ లో ఉంచుతారు అని.
అలాగే తన స్థాయికి ఎక్కువ మందికి సాయం అందించలేకపోతున్నానని ఏదన్నా చేద్దామన్నా ఎన్నో అడ్డంకులు కూడా ఎదుర్కొన్నానని ఇలా తాను ఓ పార్టీ లో చేరి కొంచెం కె పరిమితం కావడం ఇష్టం లేక కొత్త పార్టీ పెట్టుకున్నానని అదిరే సమాధానం ఇవ్వడం పవన్ ఫ్యాన్స్ లో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.