ఆస్కార్ అవార్డు విలువెంతో తెలుసా?

ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా ఆస్కార్ ని అందరూ చెబుతారు. ఈ ఆస్కార్ అవార్డు గెలుచుకుంటే ఎంతో గౌరవంగా భావిస్తారు. ఆస్కార్ అవార్డులకి నామినేషన్ కావడం అంటేనే చాలా గొప్ప అచీవ్మెంట్. ఇక అవార్డు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. హాలీవుడ్ దర్శకులు, నటులు అందరూ ఈ అవార్డు కోసం పోటీ పడుతూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఇండియా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు ఎంపికైంది.

అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో రెండు ఎంపిక అయ్యాయి. వీరిలో ఎవరు అవార్డు గెలుచుకున్న అది కచ్చితంగా గౌరవంగానే భావించారు. ఇక ఆర్ఆర్ఆర్ సాంగ్ కి అవార్డు వస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. ఇదిలా ఉంటే అసలు ఆస్కార్ అవార్డుని దీంతో తయారు చేస్తారనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఆస్కార్ అవార్డు గోల్డ్ కలర్ లో ఉంటుంది. అయితే నిజానికి గోల్డ్ కాదు. గోల్డ్ కోటేడ్ తో ఈ అవార్డుని తయారుచేస్తారు.

ఆస్కార్ అవార్డు తయారు చేయడానికి ₹32,000 ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అయితే దీనిని మార్కెట్ లో అమ్మాలుకుంటే మాత్రం కేవలం 1 డాలర్ మాత్రమే వస్తుంది. గతంలో ఆస్కార్ అవార్డుకి చాలా విలువ ఉండేది. ఓర్సన్ విల్లీస్ అనే స్క్రీన్ ప్లే రైటర్ కి అవార్డు రాగా దానిని అతను బహిరంగ వేలం వేసారు. తద్వారా మార్కెట్ లో ఏకంగా ఆ అవార్డుకి 7.2 కోట్ల రూపాయిలు వచ్చింది. అయితే ఈ విషయం ఆస్కార్ అకాడమీ దృష్టికి వెళ్ళడంతో వారు కాస్తా సీరియస్ అయ్యారు.

అదే సమయంలో ఆస్కార్ అవార్డు విలువ కేవం ఒక్క డాలర్ గా నిర్ణయించారు. అవార్డుని ఒక్క డాలర్ మించి ఎవరు కొనకూడదు అనేది కూడా నిబంధనలలో పెట్టారు. అయితే ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఒక్క డాలర్ విలువ పెట్టడం వెనుక కారణం ఉంది. దీనిని సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ లో ప్రతిభ చూపించిన వారికి గౌరవంగా మాత్రమే ఇస్తారు. ఆ గౌరవాన్ని మార్కెట్ లో అమ్మకానికి పెట్టకూడదు అనేది వారి నిబంధన. అందుకే ఒక్క డాలర్ మాత్రమే దీని ధరగా నిర్ణయించారు.