మళ్లీ టాక్సీవాలా డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ.. పట్టాలెక్కేది మాత్రం వచ్చే సంవత్సరమే!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి డిఫరెంట్ జోనర్ ట్రై చేయబోతున్నాడు. అతను టాక్సీవాలా సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో కలిసి మరోసారి పని చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడి 14 వర్కింగ్ టైటిల్తో అనౌన్స్ అయింది. పిరియాడిక్ యాక్షన్ డ్రామగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

డియర్ కామ్రేడ్, ఖుషి సినిమాల తర్వాత మైత్రి మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రం ఈ సినిమా. హైదరాబాదు, కర్నూల్, అనంతపూర్, వైఎస్ఆర్ జిల్లాలోని కొన్ని అరుదైన లొకేషన్స్ లో సినిమా చిత్రీకరణ చేస్తారట. ఈ చిత్రంలో మునుపెన్నడు కనిపించని గెటప్ లో రౌడీ బాయ్ ఉంటాడని చిత్ర యూనిట్ చెప్తోంది.

ఈ లుక్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతారని ఆడియన్స్ కి కూడా ఈ గెటప్ ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుందని అంటున్నారు.విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించబోతుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. స్పై యాక్షన్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడే ముగింపు దశకి చేరుకుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాది మార్చి 25 కి ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
దీంతోపాటు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు ఈ రౌడీ బాయ్