పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ సినిమా స్పిరిట్ గురించి మరో కీలక సమాచారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో తొలుత హీరోయిన్‌గా దీపికా పదుకునేను ఫైనల్ చేసినట్లు చెప్పినా, తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీపిక రోజుకు 6 గంటల వర్క్ షిఫ్ట్, రూ.20 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటా వంటి డిమాండ్లు పెట్టినట్టు టాక్. అంతేకాక, తెలుగులో డైలాగులు చెప్పలేనని ఆమె చేసిన అభ్యర్థన కూడా మేకర్స్‌కు ఇబ్బందిగా మారిందని సమాచారం. దీపిక ఇటీవల తల్లి అయిన నేపథ్యంలో కెరీర్‌ను తగ్గించుకోవాలన్న నిర్ణయం కూడా ఇలాంటి విషయాల నుంచి తప్పుకోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
ఇక దీపిక స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను సంప్రదిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సప్త సాగరదాచే ఎల్లో సినిమా ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకున్న రుక్మిణికి స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్ట్ దక్కితే, అది ఆమె కెరీర్‌కు మైలురాయిగా మారుతుంది. ఇప్పటికే నిఖిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, ఇది ఆమెకు ప్రధానమైన పాన్ ఇండియా బ్రేక్ కావొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ – సందీప్ కాంబినేషన్‌పై భారీ అంచనాలున్నాయి. త్వరలో చిత్రబృందం హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.