వైరల్ : ఎన్టీఆర్ ట్యాగ్ కాపీ కొట్టేసిన మహేష్.!

టాలీవుడ్ సినిమాల దగ్గర ఇప్పుడు అంతా హైప్ మీదే నడుస్తుంది. సినిమా టైటిల్ నుంచి ప్రతి చిన్న అంశం కూడా హైప్ తోనే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. రిలీజ్ డేట్ కి హైప్ ఎలా తీసుకెళ్లారు? అనే దానిపై మొదటి రోజు వసూళ్లు కూడా డిసైడ్ అవుతాయి. మరి అలా సినిమాకి మొదటగా హైప్ తెచ్చేది ఏదన్నా ఉంది అంటే అది సినిమా టైటిల్ అని చెప్పాలి.

ఆ టైటిల్ ఎంత మాస్ అండ్ పవర్ ఫుల్ గా ఉంటే ఫ్యాన్స్ కి అంత కిక్ అలాగే మాస్ ఆడియెన్స్ కూడా అటెన్షన్ ని అంతే తొందరగా ఈ టైటిల్స్ అందుకుంటాయి. అయితే వీటికి అదనపు పవర్ అందించేవి మాత్రం అవి వాటి శీర్షికలు అని చెప్పొచ్చు. ఈ క్యాప్షన్ లు కూడా ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ పాత్ర పోషిస్తాయి.

ఇప్పటివరకు చాలానే సినిమాలకి టైటిల్ కింద చిన్న లైన్ లో కాప్షన్ లు కనిపించగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” క్యాప్షన్ వైరల్ గా మారింది. నిన్న వచ్చిన ఈ టైటిల్ కింద “హైలీ ఇన్ ఫ్లేమబుల్” అంటూ ట్యాగ్ చేశారు.

అయితే ఇది చూసిన తర్వాత ఎక్కడో ఇంతకు ముందే ఉన్నట్టు ఉందే అని ఆరా తీస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం “రాఖీ” సినిమా ట్యాగ్ ని అయితే మహేష్ సినిమాకి కాపీ కొట్టేసారు. రాఖీ చిత్రానికి అప్పట్లోనే ఈ క్యాప్షన్ ఉంది. మళ్ళీ దీనిని ఇపుడు మహేష్ సినిమాకి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య అయితే రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ త్రివిక్రమ్ పై ఎన్నో కాపీ మరకలు ఉన్నాయి. ఇప్పుడు తన వల్ల అది మహేష్ కి కూడా అంటుంది.