బిగ్ బాస్… ఈ షో ఇప్పటిది కాదు.. దశాబ్దాల నుంచి ఇండియాలో రన్ అవుతున్న షో. మన తెలుగులోకి వచ్చి నాలుగేళ్లే అయింది కానీ.. ఈ షో హిందీలో 2006లోనే ప్రారంభం అయింది. ఆ తర్వాత కన్నడలో 2013లో, బెంగాలీలో 2013లో ప్రారంభం అయింది. తమిళంలోనూ నాలుగేళ్ల కింద ప్రారంభం అయింది.
ఏ భాషలో ప్రారంభం అయినా ఈ షో సూపర్ సక్సెస్ అవుతోంది. ఎందుకంటే.. ఓ పది మంది ఒకే ఇంట్లో నెలలకు నెలలకు ఉంచి.. వాళ్ల చుట్టూ కెమెరాలు పెడితే.. వాళ్లు ఆ ఇంట్లో ఏం చేస్తుంటారు.. అని తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పాయింటే బిగ్ బాస్ సక్సెస్ కు కారణం. అందుకే.. ఏ భాషలో అయినా బిగ్ బాస్ సక్సెస్ అయింది.
ఇక.. మన తెలుగులోకి వస్తే.. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. అయితే.. తెలుగు బిగ్ బాస్ షోలో తెలుగు మాట్లాడేవాళ్లతో పాటు అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలతో పాటుగా.. వేరే రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు కూడా చాన్స్ వచ్చింది.
సీజన్ 1 నుంచి సీజన్ 4 వరకు ఒకరిద్దరికి వేరే భాష వాళ్లకు కూడా బిగ్ బాస్ తెలుగులో అవకాశం కల్పిస్తున్నారు. సీజన్ వన్ లో తెలుగు రాని కంటెస్టెంట్లలో దీక్షా పంత్, ముమైత్ ఖాన్ ఉండగా.. రెండో సీజన్ లో పూజా రామచంద్రన్, మూడో సీజన్ లో బాబా భాస్కర్, నాలుగో సీజన్ లో సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, మోనల్ గజ్జర్ ఉన్నారు.