Movie Reviews: ఇక థియేటర్ల ముందు సినిమా రివ్యూలకు నో..!?

Movie Reviews: ఇటీవల కాలంలో థియేటర్ల ముందు యూట్యూబ్‌ ఛానళ్లు, కొందరు నెటిజన్లు రివ్యూలు ఇవ్వడం ఎక్కువైపోయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ హడావుడి రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తున్నాయని తమిళ్‌ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. ఇలాంటి రివ్యూలను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

Bharateeyudu 2 Movie Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ & రేటింగ్…

Vettaiyan Movie Review: రజినీకాంత్ ‘వేట్టైయాన్’ సినిమా ఎలా ఉందంటే…?

Kanguva Movie Review: కంగువ మూవీ రివ్యూ & రేటింగ్…

సినిమా సమీక్ష పేరుతో వ్యక్తిగత దాడులు.. విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని ఖండిస్తూ.. సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్‌ చేసింది. రివ్యూలు ఈ ఏడాది విడుదలైన చాలా సినిమాలపై ప్రభావం చూపించాయి. వీటిలో ప్రముఖంగా ‘ఇండియన్‌ -2’, ‘వెట్టైయాన్‌’, ‘కంగువ’పై పబ్లిక్‌ టాక్‌, యూట్యూబ్‌ ఛానెళ్లు ఇచ్చే విశ్లేషణలు ఎంతో ప్రభావం చూపించాయి.

Indian 2 – Vettaiyan – Kanguva

సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారుతున్న ఈ సమస్యను నివారించేందుకు అన్ని సంఘాలు కలిసి రావాలి. థియేటటర్‌ యజమానులు యూట్యూబ్‌ ఛానెళ్లను సినిమా థియేటర్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో సమయంలో థియేటర్ల వద్ద పబ్లిక్‌ రివ్యూలను అనుమతించవద్దు. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నాం. ఇకపై ఇలాంటివి చేస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించింది.

KK Survey Analysis Over Maharashtra, Jharkhand Elections | KK Survey Kiran | Modi | RahulGandhi | TR