‘పాత బాటిల్ లో కొత్త సారా’.. గాడ్ ఫాదర్ సినిమా గురించి దారుణంగా రివ్యూ ఇచ్చిన సినీ క్రిటిక్…?

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ .’లూసిఫర్’ అనే మలయాళం సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు మోహనరాజా దర్శకత్వం వహించాడు. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార వంటి సెలబ్రిటీలు కీలక పాత్రలలో నటించారు. భార్య అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా నాలుగు భాషలలో విడుదల కానుంది.

మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా గురించి సినీ క్రిటిక్, సెన్సార్ సభ్యుడు అయిన ఉమర్ సంధు సినిమా రివ్యూ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ఇటీవల ఈ సినిమా చూసిన ఉమైర్ సందు ట్విట్టర్ వేదికగా గాడ్ ఫాదర్ రివ్యూ ని తెలియజేశాడు. ‘గాడ్ ఫాదర్ యావరేజ్ ఫ్లిక్. కొత్త సీసాలో పాత సారా లాగా ఉంది అంటూ రివ్యూ ఇచ్చాడు.

అంతేకాకుండా చిరంజీవి మీరు దయచేసి రెస్ట్ తీసుకోండి. మాస్ హీరో వంటి పాత్రల నుండి బయటికి వచ్చి మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ ఎన్నుకోండి. మీరు ఒక మెగాస్టార్.. కానీ స్క్రిప్ట్ ఎంపికలో అది కనిపించటం లేదు . చెత్త స్క్రిప్ట్ లతో మీ సమయం వృధా చేయకండి’ అంటూ రాడుకొచ్చాడు. ఇక గాడ్ ఫాదర్ సినిమా కి 2 కి గాను 1 రేటింగ్ ఇచ్చాడు. ఉమర్ సంధు చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.