Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు నాగార్జున ఒకరు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన విభిన్న కథా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ వీడియోలో భాగంగా తాను ఒక స్టార్ హీరోని చూసి ఇండస్ట్రీలోకి రాకూడదని ఫిక్స్ అయ్యాను అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఎవరిని చూసి ఇండస్ట్రీలోకి రాకూడదనుకున్నారు ఏంటి అనే విషయానికి వస్తే.. నాగార్జునతో పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఎంతో మంచి క్రేజ్ ఉన్న విషయం మనకు తెలుసులే. నాగార్జున కంటే ముందుగానే ఇండస్ట్రీలోకి చిరంజీవి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు.
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. అయితే ఒకానొక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు నాగార్జునతో మాట్లాడుతూ అసలు డాన్స్ ఎలా వేయాలి అనేది ఒకసారి చిరంజీవి చూసి నేర్చుకో అంటూ తనకు క్లాస్ పీకారట. అయితే ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా నాగార్జున స్వయంగా ఆ సినిమా చూడటం కోసం వెళ్లారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పాటను చిత్రీకరిస్తుండగా చిరంజీవి మాత్రం అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడంతో నాగార్జున ఆయన డాన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట ఇలాంటి బ్రేక్ డాన్సులు చేయడం అంటే మన వల్ల కాదు కానీ మనం ఏదైనా వేరే బిజినెస్ చేసుకోవడం మంచిదని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు స్వయంగా నాగార్జున ఈ విషయాన్ని ఓ సందర్భంలో వెల్లడించారు. కానీ నాగార్జున కూడా తన తండ్రి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.