మెగా మామల ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్.. వార్ ముగిసినట్టేనా!

ఇద్దరు హీరోల కోసమో,రెండు రాజకీయ పార్టీల కోసమో జనాలు కొట్టుకుంటూ ఉంటే వాళ్లు వాళ్లు బానే ఉంటారు మధ్యలో మీరెందుకు కొట్టుకు చస్తారు అంటూ కొందరు నీతి బోధనలు చేస్తారు. అయితే ఆవేశంలో ఉన్న పిచ్చి జనాలు మా రాజకీయ నాయకులు, మా హీరో అంటూ వాళ్ల సమస్యని తన భుజాల మీద వేసుకుంటారు. అయితే పైన చెప్పినట్టు ఆ హీరోలు, ఆ రాజకీయ నాయకులుబాగానే ఉంటారు మధ్యలో నలిగిపోయేది పిచ్చి జనాలే.

ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ మరొకసారి నిజమైంది. విషయం ఏమిటంటే ఇన్ని రోజులు అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి చెడింది, వాళ్ల మధ్య దూరం పెరిగింది అంటూ బోలెడన్ని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పుష్ప సినిమా గురించి టాలీవుడ్ మొత్తం స్పందించింది కానీ మెగా కుటుంబం స్పందించలేదు. అలాగే పుష్ప సినిమాలో డైలాగులు కొన్ని చిరంజీవిని ఉద్దేశించి చేసినవే అంటూ మండిపడ్డారు మెగా అభిమానులు.

సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో ఈ వాదనకి మరింత బలం చేకూరింది. మొన్న అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చిరంజీవి చూడటానికి వెళ్ళలేదు ఆయన భార్య సురేఖ మాత్రమే చూచి వచ్చారు అయితే అల్లు అర్జున్ జైలుకి వెళ్లినప్పుడు మాత్రం చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ భార్యని తీసుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అలాగే నడవలేని స్థితిలో ఉన్న నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.

అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ భార్యతో కలిసి మామ చిరంజీవి ఇంటికి వెళ్ళాడు అక్కడ కాసేపు గడిపి అక్కడే లంచ్ చేసి తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్ దంపతులు. అక్కడ నాగబాబుతో కాసేపు గడిపిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు అల్లు అర్జున్, స్నేహ. దీంతో వార్ ముగిసినట్లేనా అంటూ కొందరు, వాళ్లు వాళ్లు బానే ఉన్నారు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.