మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రూపుదిద్దుకుంటోంది. సంక్రాంతి 2026 రిలీజ్ టార్గెట్‌గా ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే లేడీ సూపర్‌స్టార్ నయనతారను కథానాయికగా ఫిక్స్ చేసిన టీమ్, ఆమె పాత్రను కొంచెం కొంచెంగా రివీల్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై తాజా బజ్ మరింత ఆసక్తికరంగా మారింది.
చిరు–శ్రీలీల కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. ఎనర్జీతో ఉండే శ్రీలీల ఇప్పటికే “గుంటూరు కారం” సినిమాతో యూత్‌లో డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఆమె చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అదో ఊపే అంటూ అభిమానులు ఊగిపోతున్నారు. చిరు స్టైల్ బ్రేక్ డ్యాన్స్‌కు శ్రీలీల గ్లామర్, గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ తోడైతే, ఆ స్పెషల్ సాంగ్ థియేటర్లలో టపాసులా పేలుతుందని చెప్పకనే చెప్పాలి.
ఈ పాటకు మాస్ బీట్స్‌లో ప్రత్యేకం అయిన భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, శ్రీలీల కోసం ప్రత్యేకంగా స్టెప్పులు డిజైన్ చేస్తూ కోరియోగ్రఫీ కూడా గ్రాండ్‌గా ఉండబోతుందట. ఇప్పటికే షూటింగ్‌లో భాగంగా కొన్ని పార్ట్స్ రెహార్సల్స్ జరిగాయని టాక్. ఈ మూవీ చిరంజీవికి పూర్తిగా కొత్తగా ఉండేలా, అనిల్ రావిపూడి కుటుంబ కథానాయకుడిగా చూపించనున్నారని తెలుస్తోంది. కామెడీ, ఎమోషన్, డ్యాన్స్, మాస్ all in one కాంబోగా వస్తోందన్న అంచనాల మధ్య, ఈ స్పెషల్ సాంగ్ మరింత హైప్ పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.