యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు చేస్తున్న పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో ఈ జూన్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న నెక్స్ట్ లెవెల్ చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ ప్రభు శ్రీరామునిగా నటించగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి దేవిగా నటించింది.
మరి ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఈ సినిమాపై హైప్ ఇప్పుడు తారా స్థాయిలో ఉంది. ఇక రీసెంట్ గానే సినిమా మొదటి సాంగ్ ట్రైలర్ లను అదిరే ప్లానింగ్ లతో రిలీజ్ చేయగా ఇప్పుడు ఆదిపురుష్ నుంచి రెండో సాంగ్ “రామ్ సియా రామ్” పాటని అయితే రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
కాగా ఈ సాంగ్ అయితే ఈ మే 29న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ అయ్యారట. దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది కానీ. ఈ సాంగ్ కోసం అయితే ఎందుకో నెవర్ బిఫోర్ ప్లానింగ్ ని మేకర్స్ చేస్తున్నారట. మెయిన్ గా తెలుగు మినహా మిగతా భాషల్లో అనేక టీవీ ఛానెల్స్ తో టై అప్ అయ్యి 70 కి పైగా రేడియో స్టేషన్స్ లలో అంతే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు యూట్యూబ్ మరియు ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో ఒకేసమయానికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇండియన్ సినిమా దగ్గర ఈ తరహాలో ఒక సాంగ్ ని లాంచ్ చెయ్యడం అనేది ఆదిపురుష్ కే చెల్లింది అని చెప్పొచ్చు. అయితే ఈ సీనియాలో మొత్తం 5 పాటలు ఉంటాయట. ప్రతీ సాంగ్ కూడా అద్భుతంగా వచ్చింది అని టాక్ ఉంది. మరి ఈ సాంగ్ అయితే ఏ రేంజ్ లోకి వెళుతుందో చూడాల్సిందే.