బండ్ల గణేష్ వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్లగణేష్ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఏ విషయం గురించి అయినా స్పందిస్తే అవి పెద్ద ఎత్తున వివాదం సృష్టిస్తూ ఉంటాయి. ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే బండ్లగణేష్ తాజాగా నెటిజన్ల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ బండ్లగణేష్ ఏం చేశారు అనే విషయానికి వస్తే…

Bandla Ganesh 1 | Telugu Rajyamతాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాను ఒక నేపాల్ కి చెందిన అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నట్లు తెలిపారు. సాధారణంగా చాలా మంది సెలబ్రెటీలు కుక్కలు పిల్లల్ని పెంచుకుని వాటి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ తను మాత్రం ఒక నేపాలి అమ్మాయిని దత్తత తీసుకుని తనని చదివిస్తూ తన బాధ్యతను తీసుకున్నానని బండ్ల గణేష్ తెలిపారు.తన భార్య చెప్పడంతో ఈ పాపను దత్తత తీసుకున్నానని ఇప్పుడు తను కూడా మా కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉందని తెలిపారు.

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు స్పందిస్తూ అన్నా మీ మనసు బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరొక నెటిజన్ స్పందిస్తూ మిమ్మల్ని నిందించి అగౌరవపరిచే స్థాయి ఆంధ్రాలో ఎవరికీ లేదంటూ కామెంట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదిఏమైనా బండ్ల గణేష్ తన మంచి మనసుతో ఒక అమ్మాయికి మంచి జీవితాన్ని ఇవ్వడం చేత అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles