రూపాయి ఖర్చు లేకుండా హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయన్- విఘ్నేష్ ?

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గుర్తింపు పొందింది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఇదిలా ఉండగా నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందె. ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకుని సహజీవనం చేసిన తర్వాత వీరిద్దరూ పెద్దలు అంగీకారంతో మహాబలిపురంలోని ఒక రిసాట్ లో చాలా ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

అయితే వీరి పెళ్లి కి సంబంధిన ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థకు విక్రయించినట్లు వార్తలు వినిపించాయి. వీరి పెళ్లికి సంబంధించిన ప్రతీ కార్యక్రమాన్ని ఓటీటీ సంస్థ చాలా ఘనంగా నిర్వహించింది. దీంతో వీరిద్దరూ రూపాయి ఖర్చు లేకుండానే వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల ఈ జంట హనీమూన్ కి వెళ్ళింది. ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి హనీమూన్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీరి హనీమూన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం వీరి హనీమూన్ కి సంబంధించిన ఖర్చు వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. స్పెయిన్ లో వీరు ఉంటున్న హోటల్ రూమ్ రెంట్ ఒక్కరోజుకి అక్షరాల రూ. 2.5 లక్షలట. అంతేకాకుండా రోజువారీ అదనపు ఖర్చులు కూడా లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఖర్చులన్నీ నయన్, విఘ్నేష్ భరిస్తున్నారనుకుంటే పొరపాటు పడ్డట్టే. అవునండీ పెళ్ళి వేడుక లాగే వీరి హనీమూన్ ట్రిప్ కి సంభందించిన ఖర్చు కూడా ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్‌ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రూపాయి ఖర్చు లేకుండా వీరిద్దరూ పెళ్ళి చేసుకొని హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.