వైరల్ : “జవాన్” లో మెయిన్ లైన్ చెప్పేసిన షారుక్..!

ఈ ఏడాది బాలీవుడ్ సినిమాకి ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. రావడం మొదటి నెల “పఠాన్” రిలీజ్ తోనే సెన్సేషనల్ కం బ్యాక్ ని అందుకున్న బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ హిట్ అందుకుంటే ఎలా ఉంటుందో చూపించాడు. దీంతో జనవరి నెలలో రిలీజ్ అయ్యి 1000 కోట్ల వసూళ్లుగా అందుకున్న ఏకైక సినిమాగా ఇది నిలవడమే కాకుండా..

ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ సినిమా దగ్గర చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డు ని ఇది బ్రేక్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత షారుక్ ఖాన్ చేసిన తదుపరి చిత్రమే “జవాన్” కాగా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. అలాగే తమిళ్ సహా బాలీవుడ్ నుంచి కూడా స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటించగా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే పాటలు ట్రైలర్ మంచి సక్సెస్ అయ్యాయి. మరి ఈ ట్రైలర్ లో చూస్తే మళ్ళీ దర్శకుడు అట్లీ లేడీస్ కోసం స్పెషల్ సినిమా తీసినట్టుగా అర్ధం అయ్యింది. కాగా ఇప్పుడు హీరో షారుక్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసాడు.

ఇది లేడీస్ కోసం తీసిన స్పెషల్ సినిమా అని అది కూడా మగవాళ్ళు తప్పకుండ చూడాల్సిన సినిమా ఇది అంటూ క్లారిటీ ఇచ్చాడు. అలానే తప్పకుండ ఈ చిత్రం అయితే అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని కూడా అలరిస్తుంది అని షారుక్ చెప్పాడు. దీనితో జవాన్ సినిమాలో మెయిన్ థీమ్ ఏంటో ఇప్పుడు రివీల్ అయిపోయింది అని చెప్పొచ్చు.