అఫీషియల్ : ఓటిటి లో “జవాన్” రిలీజ్ కూడా అలాగే..!

ఈ ఏడాది లో ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో అయితే స్టార్టింగ్ లోనే జనవరి నెలలో 1000 కోట్ల సినిమాని అందించిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. మరి షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన రెండో సినిమానే “జవాన్” కాగా ఈ సినిమా కూడా విడుదల అయ్యి సంచలన విజయాన్ని అయితే నమోదు చేసి రెండో 1000 కోట్ల గ్రాసర్ గా అయ్యితే నిలిచింది.

కాగా ఈ చిత్రాన్ని తమిళ యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించగా తన కెరీర్ లో కూడా మొదటి 1000 కోట్ల సినిమాగా ఇది నిలిచింది. ఇక ఫైనల్ గా అయితే థియేటర్స్ అనంతరం ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై మంచి క్రేజ్ నెలకొనగా ఈ సినిమా హక్కులు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇందులో ఈ సినిమాని అయితే నవంబర్ 2న షారుఖ్ బర్త్ డే కానుకగా ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో తన గత చిత్రం పఠాన్ లానే ఎక్స్ టెండెడ్ వెర్షన్ లో రిలీజ్ అవుతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

దీనితో అయితే షారుఖ్ అభిమానులకి తన బర్త్ డే రోజు మాత్రం భారీ ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నయనతార మరియు దీపికా పదుకొనె లు హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు అలాగే సినిమాని షారుఖ్ ఖాన్ భార్య గౌరి ఖాన్ షారుక్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. 
https://x.com/Chrissuccess/status/1719554150445252851?s=20